నేడు బీమా నిత్యావసరం. ప్రీమియం కట్టేందుకు ఎక్కువ డబ్బులు అవసరమని చాలామంది ఆసక్తి చూపించరు.

వీరికోసమే ఇండియా పోస్ట్‌ చవకైన పాలసీలు తీసుకొచ్చింది. ఏడాదికి రూ.299, రూ.399కే ప్రమాద బీమా ఆఫర్‌ చేస్తోంది.

ఇండియా పోస్టు పేమెంట్‌ బ్యాంక్‌ కస్టమర్లు వీటిని ఉపయోగించుకోవచ్చు. 16-65 ఏళ్ల వయస్కులు ఈ ప్రయోజనాలను పొందొచ్చు.

399 బెనిఫిట్స్: ప్రమాదవశాత్తు మరణించడం, శాశ్వతంగా వైకల్యం, పర్మనెంట్‌ పార్షియల్‌ డిసెబిలిటీ, యాక్సిడెంటల్‌ డిస్‌మెంబర్‌మెంట్‌, పెరాలసిస్‌ కవర్‌ అవుతాయి.

ప్రమాదం జరిగినప్పుడు వైద్యం ఖర్చులకు ఐపీడీ కింద రూ.60,000, ఓపీడీ కింద రూ.30,000 పొందొచ్చు.

ఒకవేళ ఆస్పత్రిలో ఉండాల్సి వస్తే రోజుకు రూ.1000 చొప్పున పది రోజులు ఇస్తారు.

ఎడ్యుకేషన్‌ బెనిఫిట్‌ ఉంటుంది. బీమా మొత్తంలో 10% లేదా లక్ష రూపాయిలు ఈ రెండింట్లో ఏది తక్కువైతే దానిని ఇద్దరు పిల్లలకు ఇస్తారు.

కుటుంబ ప్రయాణాలకు రూ.25,000, అంత్యక్రియల కోసం రూ.5000 అందిస్తారు.

రూ.299 ప్రయోజనాలు: ఎడ్యుకేషన్, కుటుంబ ప్రయాణం, అంత్యక్రియలు, ఆసుపత్రిలో రోజువారీ ఖర్చులు ఇవ్వరు. మిగతావన్నీసేమ్ టు సేమ్.

ఆత్మహత్య, సైనిక సేవలు, సైనిక ఆపరేషన్లు, యుద్ధం, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లు, రోగాలు, ఎయిడ్స్‌, ప్రమాదకరమైన క్రీడల్లో ప్రమాదాలు జరిగితే బీమా కవర్‌ అవ్వదు.