పెద్ద నోట్ల రద్దు - 2016, నవంబర్‌ 8న రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేశారు.

స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ - 2014, అక్టోబర్‌ 2 గాంధీ జయంతిన ఆరంభించారు.

జీఎస్టీ - 17 ఏళ్లుగా ప్రయత్నించినా కానిది మోదీ రాగానే 2017, జులై 1న అమలు చేశారు.

ట్రిపుల్‌ తలాక్‌ - ముస్లిం మహిళలకు అండగా 2018, ఆగస్టు 1 బిల్‌ పాస్‌ చేశారు.

ఆర్టికల్‌ 370, 35(A) రద్దు - 2019, ఆగస్టు 5న కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు చేశారు.

సర్జికల్ స్ట్రైక్స్‌ - భారత జవాన్ల మరణానికి ప్రతీకారంగా 2016, సెప్టెంబర్‌ 18న పీఓకేలో 40 టెర్రరిస్టుల్ని చంపారు.

బాలాకోట్‌ ఎయిర్‌ స్ట్రైక్స్‌ - పుల్వామాలో 40 సీఆర్పీఎఫ్‌ జవాన్లపై దాడికి ప్రతీకారంగా 2019, ఫిబ్రవరి 26న ఎయిర్‌ స్ట్రైక్స్‌ చేశారు. అభినందన్‌ను సురక్షితంగా తీసుకొచ్చారు.

బ్యాంకుల విలీనం - 10 ప్రభుత్వ బ్యాంకులు విలీనం చేసి 4 పెద్ద బ్యాంకులుగా మార్చారు.

సీఏఏ - 2020, జనవరి 10న అమలు చేశారు. సిక్కు, హిందూ, బుద్ధ, పార్సీ, క్రిస్టియన్‌ ఇమ్మిగ్రంట్స్‌కు పౌరసత్వం వచ్చింది.

టెలికాం రంగానికి ఊరట - అప్పుల ఊబి నుంచి ఉపశమనం ప్యాకేజ్‌ ఇచ్చారు. విడతల వారీగా రుణాలు చెల్లింపు, 100% FDIని ఆమోదించారు.