చాలామందికి మొబైల్, ఆధార్ నంబర్లు గుర్తుంటాయి!

అదేంటో.. పాన్ నంబర్ దగ్గరికి వచ్చేసరికి కంగారు పడుతుంటారు.

పాన్ నంబర్ ఎలా ఇస్తారో తెలుసుకుంటే గుర్తుంచుకోవడం సులభం.

పాన్‌ కార్డు నంబరులో మీ వ్యక్తిగత సమాచారం దాగి ఉంటుంది.

పాన్‌ కార్డులో తొలి ఐదు ఇంగ్లిష్ లెటర్స్, త‌ర్వాత నాలుగు అంకెలు, చివ‌ర్లో మళ్లీ ఓ ఇంగిష్ల్ లెటర్ ఉంటుంది.

చాలా మంది సున్నాకు ఓకు తేడా తెలియక పొరపడుతుంటారు.

పాన్‌లో మొద‌టి 3 అక్షరాలు AAA to ZZZ సిరీస్‌లో ఉంటాయి. నాలుగో దానికి ప్రత్యేకత ఉంటుంది.

వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులందరికీ ‘P’ అక్షరాన్ని కేటాయిస్తారు.

ఇక ఐదో అక్షరం మీ ఇంటి పేరు మొద‌టి అక్షరాన్ని తెలియజేస్తుంది.

ఆ త‌ర్వాత 4 నంబర్లు 0001-9999 ఉంటాయి. చివ‌ర్లో ఎప్పుడూ అక్షరమే ఉంటుంది.