మోటో ఈ22ఎస్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో సోమవారం లాంచ్ అయింది. దీని ధరను రూ.8,999గా నిర్ణయించారు. అక్టోబర్ 22వ తేదీ నుంచి మోటో ఈ22ఎస్ సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత మై యూఎక్స్ ఆపరేటింగ్ సిస్టంపై మోటో ఈ22ఎస్ పని చేయనుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 10W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్‌పై ఈ లేటెస్ట్ మొబైల్ పని చేయనుంది. ఫోన్ వెనకవైపు 16MP + 2MP కెమెరాలు ఉన్నాయి. ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు.