రోజూ ఒక్క కిలోమీటర్ నడిస్తే చాలు.. ఈ బెనిఫిట్స్ మీవే

Published by: Geddam Vijaya Madhuri

నడవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీనివల్ల కండరాల బిగుతు తగ్గుతుంది.

క్రమం తప్పకుండా నడవడం వల్ల మెటబాలీజం పెరుగుతుంది. రోజంతా ఉల్లాసంగా ఉంటారు.

నడుస్తున్నప్పుడు మెదడులో ఎండార్ఫిన్స్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది.

అది మానసిక అలసటను తగ్గించి మూడ్ను తక్షణమే మెరుగుపరచడానికి చాలా సహాయపడుతుంది.

ప్రతిరోజు 1 కిలోమీటర్ నడవడం వల్ల తక్కువ కేలరీలు ఖర్చవుతున్నప్పటికీ.. బరువు తగ్గడానికి ఇది మొదటి అడుగు.

హృదయ స్పందనలను నియంత్రించడానికి, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఇది ఉత్తమ వ్యాయామం.

ఏ వ్యక్తులు అస్సలు వ్యాయామం చేయరో.. వారు కనీసం 1 కిలోమీటర్ నడిస్తే మంచిది.

క్రమంగా నడక వేగం, దూరాన్ని పెంచడం ద్వారా ఫిట్‌నెస్‌ను మరింత మెరుగుపరచవచ్చు.

ప్రతిరోజు సుమారు 30 నిమిషాలు లేదా 7000 అడుగులు నడవటమనేది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.