వేసవిలో పచ్చి మామిడి తింటే ఎంత మంచిదో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri

అందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడానికి చాలా సహాయపడుతుంది.

పచ్చి మామిడిలో విటమిన్ ఎ, ఇ, కె, ఫోలేట్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు శరీరాన్ని లోపలి నుంచి బలంగా చేస్తాయి.

అందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు కళ్లకు కాంతిని, చర్మ సౌందర్యాన్ని కాపాడుతాయి.

వేసవి కాలపు తీవ్రమైన వేడిలో పచ్చి మామిడికాయ తినడం వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం తగ్గుతుంది.

ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

పచ్చి మామిడిలో ఐరన్, కాల్షియం ఎముకలు, రక్తం కోసం ఉపయోగపడతాయి.

ఊరగాయ, చట్నీగా చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

వేసవిలో తింటే శరీరాన్ని హైడ్రేటెడ్గా, శక్తివంతంగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది.