రిస్క్ లేని పెట్టుబడులు పెట్టాలను వాళ్లకు ఎల్‌ఐసీ జీవన్ అక్షయ్ పథకం ఒక మంచి ఆప్షన్‌.

ఒకరు లేదా ఇద్దరు కలిసి జాయింట్ పాలసీ తీసుకోవచ్చు. ఒకరికి కనీస ప్రీమియం లక్ష. ఇద్దరైతే చెరో లక్ష చెల్లించాలి.

ఇందులో కనీస పింఛను రూ. 12 వేలు. ప్రతి నెల/3 నెలలు/ 6 నెలలు/ ఏటా పింఛను అందుకోవచ్చు. పెట్టుబడిని బట్టి పింఛను పెరుగుతుంది.

ఈ పాలసీలో 10+ యాన్యుటీ ఆప్షన్స్‌ ఉన్నాయి. పాలసీ ప్రారంభంలోనే, గ్యారెంటీ యాన్యుటీ రేట్‌ ఎంతో పాలసీదారుకు తెలుస్తుంది.

ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే పెన్షన్ ఆగిపోతుంది. నామినీకి పెట్టుబడి తిరిగి వస్తుంది.

ఈ పెన్షన్ స్కీమ్‌లో పెట్టిన పెట్టుబడికి సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.

ఎల్‌ఐసీ జీవన్‌ అక్షయ్‌ పాలసీలో సింగిల్‌ ప్రీమియంగా రూ. 9,16,200 జమ చేస్తే.. నెలకు రూ. 6,859 చేతికి వచ్చే అవకాశం ఉంది.

సంవత్సరానికి రూ. 86,265... ఆరు నెలలకు రూ. 42,008... మూడు నెలలకు రూ. 20,745 పొందుతారు.

నెలనెలా 20 వేల రూపాయల పెన్షన్ పొందాలంటే ఏక మొత్తంలో రూ. 40.72 లక్షల పెట్టుబడి పెట్టాలి.

ఏటా ప్రీమియం కట్టాల్సిన బాదరబందీ లేకుండా ఉండాలంటే ఈ పాలసీని ఎంచుకోవచ్చు.