2022లో వేల మంది ఉద్యోగుల్ని తొలగించిన టెక్‌ కంపెనీలు ఇవే!

యాపిల్‌ కంపెనీ ఆగస్టులో 100 మంది కాంట్రాక్టు రిక్రూటర్లను తొలగించింది.

ఆదాయం తగ్గడంతో టెన్సెంట్‌ కంపెనీ చివరి క్వార్టర్లో 5500 మందిని తీసేసింది.

నెట్‌ఫ్లిక్స్‌ జూన్‌లో 300, మేలో 150 మంది ఉద్యోగుల్ని తొలగించింది.

జులైలో మైక్రోసాఫ్ట్‌ ప్రపంచ వ్యాప్తంగా 1800 ఉద్యోగుల్ని తీసేసింది.

టాలెంట్‌ అక్విజిషన్‌ టీమ్‌లో 30 శాతం మందిని ట్విటర్‌ తొలగించింది.

జులైలో సాన్‌ మేటియో, కాలిఫోర్నియాలో 229 మందిని తొలగించినట్టు టెస్లా తెలిపింది.

కష్టపడి పనిచేయకపోతే ఉద్యోగుల్ని తొలగిస్తామని గూగుల్‌ హెచ్చరించినట్టు వార్తలు వచ్చాయి.

కొన్ని కారణాలతో టెక్‌ కంపెనీలు ఉద్యోగుల పెర్ఫామెన్స్‌ పేను ఆలస్యంగా ఇస్తున్నాయి.

ఆర్థిక మాంద్యం పరిస్థితులు, ఖర్చులు పెరగడంతో కంపెనీలు ఇలా చేస్తున్నాయి.