ఐటీఆర్ సబ్మిట్ చేయలేదా? లేట్‌గా ఫైల్ చేస్తే జరిగే నష్టాలివీ!
2021-22 ఆర్థిక ఏడాదికి ఐటీఆర్ (ITR Filing) ఫైల్ చేసేందుకు జులై 31 ఆఖరి తేదీ.
బిలేటెడ్ ఐటీఆర్ కు రూ.5000 జరిమానా ఉంటుంది. పన్ను ఆదాయం రూ.5 లక్షలు దాటని వారు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది.
ఐటీఆర్‌ను నిర్దేశిత గడవులోపు సమర్పించకపోతే కొన్ని విభాగాల కింద నష్టాలను క్యారీ ఫార్వర్డ్ చేయలేరు.
ఇతర ఆదాయం, మూలధన రాబడి, స్పెక్యులేషన్ సహా వ్యాపారం, ప్రొఫెషనల్ ఆదాయం కింద నష్టాలను చూపించలేరు.
మీకు ఆదాయపన్ను రీఫండ్ రావాలంటే ఐటీఆర్ కచ్చితంగా ఫైల్ చేయాలి. పైగా అది తనిఖీ అవ్వాలి. లేదంటే రీఫండ్ పొందలేరు.
ఐటీ రీఫండ్‌పై ప్రభుత్వం నెలకు 0.5 శాతం వరకు వడ్డీ చెల్లిస్తుంది. ఒకవేళ మీరు గడువు దాటాక రిటర్ను ఫైల్ చేస్తే వడ్డీ ఇవ్వరు.
ఐటీఆర్ ఆలస్యంగా సమర్పిస్తే మీరు చెల్లించాల్సిన పన్నులపై వడ్డీ కట్టాల్సి ఉంటుంది.
మీరు చెల్లించాల్సిన పన్నును బట్టి సెక్షన్ 234A, 234B, 234C ప్రకారం వడ్డీ వేస్తారు.
గడువు లోపు పన్ను చెల్లించకుంటే 234A, ఒక ఆర్థిక ఏడాదిలో చెల్లించాల్సిన అడ్వాన్స్ టాక్స్ 90% జమ చేయకపోతే 243B వర్తిస్తుంది. గత ఆర్థిక సంవత్సరం అడ్వాన్స్ టాక్స్ చెల్లించకపోతే 234C కింద పెనాల్టీ వేస్తారు.