దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 16 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది.

అనంతరం దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 221 పరుగులు మాత్రమే చేయగలిగింది.

డేవిడ్ మిల్లర్ (106 నాటౌట్: 47 బంతుల్లో) సెంచరీ చేసినా ఫలితం లేకపోయింది.

దీంతో సిరీస్‌ను కూడా టీమిండియా 2-0తో దక్కించుకుంది.

భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (57: 28 బంతుల్లో), సూర్యకుమార్ యాదవ్ (61: 22 బంతుల్లో) అర్థ సెంచరీలు చేశారు.

రోహిత్ శర్మ (43: 37 బంతుల్లో), విరాట్ కోహ్లీ (49 నాటౌట్: 28 బంతుల్లో) వీరికి చక్కటి సహకారం అందించారు.

దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ రెండు వికెట్లు తీసుకున్నాడు.

లక్ష్యం భారీగా ఉండటంతో మిల్లర్, డికాక్ (69 నాటౌట్: 48 బంతుల్లో) ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు, అక్షర్ పటేల్ ఒక వికెట్ దక్కించుకున్నారు.
(All Images Credit: BCCI)