మేడిన్‌ ఇండియా సెమీ కండక్టర్లు, గ్లాస్‌ ఫ్యాబ్రికేషన్‌తో ల్యాప్‌టాప్‌ సహా ఇతర గ్యాడ్జట్‌ ధరలు తగ్గనున్నాయి!

రూ.లక్ష ల్యాప్ ట్యాప్‌ ఇండియాలో చిప్‌, గ్లాస్‌ వల్ల రూ.40వేల కన్నా తక్కువకే వస్తుందని వేదాంత ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ అన్నారు.

ప్రస్తుతం తైవాన్‌, కొరియాలో తయారవుతున్న గ్లాస్‌ అతి త్వరలో ఇండియాలో ఉత్పత్తి చేస్తాయని వెల్లడించారు.

వీటి వల్ల ల్యాప్‌టాప్‌లే కాకుండా వాహనాలు, ఇతర ఫినిష్‌డ్‌ ఉత్పత్తుల ధరలు తగ్గుతాయని స్పష్టం చేశారు.

ఒక్క వాహన రంగానే కాదు, స్మార్ట్‌ ఫోన్లు, ఏటీఎం కార్డులు సహా మొత్తం ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమకు ఈ చిప్‌ అత్యంత కీలక విడిభాగం.

అత్యంత చిన్నగా ఉండే ఈ చిప్‌, అతి పెద్ద ఎలక్ట్రానిక్‌ పరికరంతో స్మార్ట్ వర్క్‌ చేయిస్తుంది.

చిప్‌/సెమీకండక్టర్‌ల తయారీ ఫ్లాంటును భారత్లో నెలకొల్పేందుకు వేదాంత , ఫాక్స్‌కాన్‌ చేతులు కలిపాయి.

డిస్‌ప్లే ఫ్యాబ్రికేషన్ & సెమీకండక్టర్ తయారీ కేంద్రాన్ని గుజరాత్‌లో ఏర్పాటు చేసేందుకు వేదాంత, ఫాక్స్‌కాన్‌ సంతకాలు చేశాయి.

మొత్తం పెట్టుబడి ₹1.54 లక్షల కోట్లకు పైగా ఉంటుంది. ఇందులో, ₹94,500 కోట్లను డిస్‌ప్లే తయారీ, ₹60,000 కోట్లను సెమీకండక్టర్‌ తయారీ ప్లాంటుకు పెట్టుబడి.

ఈ JVలో వేదాంతకు 60%, ఫాక్స్‌కాన్‌కు 40% వాటా ఉంటుంది. రెండేళ్లలో ఉత్పత్తి ప్రారంభమవుతుంది. 28 నానోమీటర్ల (nm) టెక్నాలజీ నోడ్‌లపై పనిచేస్తుంది.