ఆ ఊరికి వెళ్లితే పాతిక లక్షలు ఇస్తారు

దక్షిణ ఇటలీలోని పుగ్లియాలోని గ్రామం ప్రెసిక్సే. ఇది నిజంగా ఒక అందమైన ప్రదేశం.

ఈ గ్రామానికి వెళ్లి సెటిలైతే మీకు పాతిక లక్షల రూపాయలు ఇస్తారు అక్కడి స్థానిక అధికారులు.

ఇలా పౌరులను రమ్మని అడగాల్సిన పరిస్థితి ఏమొచ్చింది అక్కడ?

ఈ గ్రామంలో మౌలిక వసతులు తక్కువ. ఏది కావాలన్నా చాలా దూరం వెళ్లి కొని తెచ్చుకోవాలి.

అక్కడికి వెళ్లి ఇల్లు కొనుక్కుని ఉన్నా కూడా ఏదైనా వ్యాపారం చేసుకుని బతకాలి తప్ప ఉద్యోగాలు అయితే రావడం కష్టం.

కేవలం ప్రెసిక్సే గ్రామమే కాదు, ఇటలీలోని ఎన్నో అందమైన గ్రామాలు ఖాళీ అవుతున్నాయి.

ఇటలీ అంతటా దాదాపు ఇళ్ల ధరలు తగ్గాయి. ఎవరైనా విదేశీయులు వచ్చి నివసించేందుకు కూడా అవకాశం కల్నిస్తున్నాయి ఇటలీ అధికార వర్గాలు.

జీవనోపాధి కల్పిస్తే ఎంతో మంది ప్రజలు తిరిగి గ్రామాలకు వెళ్లే అవకాశం ఉంది.