ప్రతి రోజు స్నానం చేయాలని తెలుసు కానీ ఎప్పుడు చేయాలనేది చాలా మందికి డౌట్ ఉంటుంది.
పగలు స్నానం చేస్తే మంచిదా లేదా రాత్రి పడుకునే ముందు స్నానం చేయాలా?
పరిశుభ్రత, మంచి ఆరోగ్యానికి స్నానం చాలా అవసరం, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి, ఉత్తేజంగా ఉంటుంది.
సాధారణంగా ప్రజలు ఆఫీసుకు వెళ్లే ముందు లేదా తమ రోజును ప్రారంభించే ముందు ఉదయం పూట స్నానం చేస్తారు.
కొంతమంది ఉదయం స్నానం చేయడానికి ఇష్టపడితే, మరికొందరు రాత్రి పడుకునే ముందు స్నానం చేస్తారు.
అందుకే స్నానం ఎప్పుడు చేయడం ఆరోగ్యానికి మేలు అనే ప్రశ్న తలెత్తుతుంది.
ఉదయాన్నే స్నానం చేయడం మీ రోజును ప్రారంభించడానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీరు రోజంతా తాజాగా, ఉత్తేజంగా ఉండేందుకు సహాయపడుతుంది.
భారత్‌లో చాలా మంది ఉదయం పూట స్నానానికి ప్రాధాన్యత ఇస్తారు.
రాత్రి నిద్ర తర్వాత శరీరం నీరసపడుతుంది, కానీ ఉదయాన్నే స్నానం చేయడం వల్ల ఈ బద్ధకం పోయి, కొత్త శక్తి వస్తుంది. ఆరోగ్య పరంగా చూస్తే రాత్రిపూట స్నానం చేయడం కూడా ప్రయోజనకరం.
రాత్రిపూట స్నానం చేయడం వల్ల రోజంతా మీ శరీరంపై పేరుకుపోయిన మురికి, బ్యాక్టీరియా, దుమ్ము, మలినాలు తొలగిపోతాయి.
జపాన్, కొరియా, చైనా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో ప్రజలు రాత్రిపూట స్నానం చేయడానికి ఇష్టపడతారు.