మద్యం ఆరోగ్యానికి హానికరం అని ప్రతీ సీసాపై రాసి ఉంటుంది.

మద్యం తాగడం వల్ల 60 కంటే ఎక్కువ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది

అనేక మందికి మద్యం వలన కేన్సర్ లేదా గుండె జబ్బులు మాత్రమే వస్తాయనిపిస్తుంది, కాని దాని జాబితా చాలా పెద్దది.

కొవ్వు కాలేయం, కాలేయపు వాపు సిర్రోసిస్ వంటి ప్రాణాంతక వ్యాధులు మద్యం కారణంగా వస్తాయి.

మద్యపానం మానసిక , ప్రవర్తనా సంబంధిత అనేక రుగ్మతలకు దారి తీస్తుంది

అధికంగా మద్యం సేవించడం వల్ల సెరెబ్రల్ క్షీణత, మూర్ఛ సమస్యలు వస్తాయి.

దీర్ఘకాలిక రక్తపోటు , ఇస్కీమిక్ స్ట్రోక్ వంటి తీవ్రమైన పరిస్థితులకు కూడా మద్యం కారణమవుతుంది.

కాన్సర్, టైప్ 2 డయాబెటిస్, న్యుమోనియా, టీబీ వచ్చే అవకాశాలు కూడా మద్యం తాగేవారిలో ఉంటాయి.

మద్యపానం మీ జీవితాన్ని నయం చేయలేని వ్యాధులతో నింపడానికి ప్రధాన కారణం కావచ్చు.