ఫాస్ట్‌ ట్రాక్ కోర్టులు అంటే ఏంటీ? ఎలా పని చేస్తాయి?

Published by: Khagesh

నీట్‌ పేపర్ లీకేజీలో దోషులకు త్వరగా శిక్ష పడేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.

ఏదైనా బర్నింగ్ అంశంపై త్వరితగతిన విచారణ పూర్తి చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తారు.

న్యాయస్థానాల్లో వేలాదిగా పేరుకుపోయిన కేసుల వల్ల ముఖ్యమైన అంశంలో విచారణ ఆలస్యమవుతుందని ఫాస్ట్ ట్రాక్‌ కోర్టులు తీసుకొచ్చారు.

11వ ఆర్థిక సంఘం సూచనల మేరకు 2000లో ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ప్రారంభించారు.

అన్ని రకాల సివిల్, క్రిమినల్ కేసులు కాకుండా తీవ్రమైన నేరాలు, పేదలు, మహిళలు, పిల్లలు, సీనియర్ సిటిజన్స్‌ కేసులపై ఫోకస్ చేస్తారు.

కేసు నమోదైనప్పటి నుంచి విచారణ, సాక్ష్యాధారాల నమోదు, తీర్పు అన్ని నిర్ధిష్ట టైం పెట్టుకొని ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పని చేస్తాయి.

సాధారణ కోర్టులు మాదిరిగా కాకుండా కేసు పూర్తి అయ్యే వరకు ప్రతి రోజూ ఈ కోర్టు విచారిస్తుంది

2012లో నిర్భయ ఘటన తర్వాత బాలికలపై లైంగిక దాడుల కేసుల్లో ఫాస్ట్ ట్రాక్ స్పోషల్ కోర్టులను అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది.

ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో న్యాయమూర్తులుగా ఎక్స్‌పీరియన్స్ రిటైర్డ్ జడ్జిని కానీ, సీనియర్ జడ్జిని కానీ నియమిస్తారు.

ఇక్కడ ఇచ్చే తీర్పులకు చట్టబద్ధమైన అనుమతి ఉంటుంది. ఇక్కడ తీర్పుతో సంతృప్తి చెందకపోతే ఉన్నత న్యాయస్థానాల్లో అప్పీల్ చేసుకోవచ్చు.

ఫాస్ట్ ట్రాక్‌ కోర్టుల నిర్వహణ, మౌలిక సదుపాయాలు, న్యాయమూర్తులు, సిబ్బంది వేతనాల ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి భరిస్తాయి.