ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 279 పాయింట్లు పెరిగి 17,359 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 1031 పాయింట్లు పెరిగి 58,991 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ 698 పాయింట్లు పెరిగి 40,608 వద్ద స్థిరపడింది. రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, నెస్లే ఇండియా, ఇన్ఫీ, టాటా మోటార్స్ షేర్లు లాభపడ్డాయి. సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్స్, అదానీ పోర్ట్స్, ఏసియన్ పెయింట్స్ షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 15 పైసలు బలపడి 82.18 వద్ద స్థిరపడింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 పెరిగి రూ.60,000 గా ఉంది. కిలో వెండి రూ.700 పెరిగి రూ.74,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.510 తగ్గి రూ.26,050 వద్ద ఉంది. బిట్ కాయిన్ 2.2 శాతం తగ్గి రూ.22.97 లక్షల వద్ద ఉంది.