ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 44 పాయింట్లు పెరిగి 17,151 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 139 పాయింట్లు ఎగిసి 58,214 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ 104 పాయింట్లు పెరిగి 39,999 వద్ద స్థిరపడింది. హెచ్డీఎఫ్‌సీ లైఫ్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, సన్ ఫార్మా, టాటా కన్జూమర్ షేర్లు లాభపడ్డాయి. బీపీసీఎల్, ఎన్‌టీపీసీ, కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 82.65 వద్ద స్థిరపడింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.870 తగ్గి రూ.59,130 గా ఉంది. కిలో వెండి రూ.500 తగ్గి రూ.71,600 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.340 తగ్గి రూ.25,820 వద్ద ఉంది. బిట్‌కాయిన్ (Bitcoin) 1.69 శాతం పెరిగి రూ.23.37 లక్షల వద్ద కొనసాగుతోంది.