ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 99 పాయింట్లు తగ్గి 17,844 వద్ద ముగిసింది.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 311 పాయింట్ల పతనమై 61,691 వద్ద ముగిసింది.

నిఫ్టీ బ్యాంక్‌ 430 పాయింట్లు తగ్గి 40,701 వద్ద స్థిరపడింది.

దివీస్‌ ల్యాబ్‌, అల్ట్రాటెక్‌ సెమ్‌, టెక్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్‌, హిందాల్కో షేర్లు లాభపడ్డాయి.

సిప్లా, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, బీపీసీఎల్‌, బ్రిటానియా, యూపీఎల్‌ షేర్లు నష్టపోయాయి.

డాలర్‌తో పోలిస్తే రూపాయి 10 పైసలు బలపడి 82.73 వద్ద స్థిరపడింది.

24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర 120 తగ్గి రూ.56,830గా ఉంది.

కిలో వెండి రూ.100 తగ్గి రూ.68,500 వద్ద కొనసాగుతోంది.

ప్లాటినం 10 గ్రాముల ధర రూ.90 తగ్గి రూ.24,390 వద్ద ఉంది.

గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 0.47 శాతం పెరిగి రూ.20.47 లక్షల వద్ద కొనసాగుతోంది.