బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 44 పాయింట్ల లాభంతో 61,319 వద్ద ముగిసింది.

ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 20 పాయింట్లు పెరిగి 18,035 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ బ్యాంక్‌ 99 పాయింట్లు తగ్గి 41,631 వద్ద స్థిరపడింది.

బీపీసీఎల్‌, బజాజ్ ఫైనాన్స్‌, ఎం అండ్‌ ఎం, ఐచర్‌ మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ షేర్లు నష్టపోయాయి.

ఓఎన్‌జీసీ, టెక్‌ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్‌, దివిస్‌ ల్యాబ్‌, నెస్లే ఇండియా షేర్లు లాభపడ్డాయి.

24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములు రూ.430 తగ్గి రూ.56,730గా ఉంది.

. డాలర్‌తో పోలిస్తే రూపాయి ఒక్కరోజునే 151 పైసలు బలపడి 82.71 వద్ద స్థిరపడింది.

కిలో వెండి రూ.950 తగ్గి రూ.69,000 వద్ద కొనసాగుతోంది.

ప్లాటినం 10 గ్రాముల ధర రూ.230 తగ్గి రూ.24,490 వద్ద ఉంది.

గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 11.03 శాతం పెరిగి రూ.20.36 లక్షల వద్ద కొనసాగుతోంది.