ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 111 పాయింట్లు తగ్గి 17,043 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 337 పాయింట్లు పతనమై 57,900 వద్ద ముగింది. నిఫ్టీ బ్యాంక్ 153 పాయింట్లు తగ్గి 39,411 వద్ద స్థిరపడింది. టైటాన్, బీపీసీఎల్, ఎల్‌టీ, భారతీ ఎయిర్‌టెల్, సన్‌ఫార్మా షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఎం అండ్ ఎం, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 37 బలహీనపడి 82.49 వద్ద స్థిరపడింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.760 పెరిగి రూ.57,980 గా ఉంది. కిలో వెండి రూ.2500 పెరిగి రూ.68,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.730 పెరిగి రూ.26,180 వద్ద ఉంది. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 10.11 శాతం పెరిగి రూ.20.05 లక్షల వద్ద కొనసాగుతోంది.