నిఫ్టీ 36 పాయింట్లు పెరిగి 19,368 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 110 పాయింట్లు ఎగిసి 65,390 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ 45 పాయింట్లు తగ్గి 44,879 వద్ద క్లోజైంది. రిలయన్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ షేర్లు లాభపడ్డాయి. టైటాన్, హెచ్‌సీఎల్ టెక్, పవర్ గ్రిడ్, టీసీఎస్, హిందుస్థాన్ యునీలివర్ షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 17 పైసలు పెరిగి 82.57 వద్ద స్థిరపడింది. బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.59,410గా ఉంది. కిలో వెండి రూ.73,300 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.10 తగ్గి రూ.24,180 వద్ద ఉంది. బిట్‌కాయిన్ 0.69 శాతం తగ్గి రూ.24.85 లక్షల వద్ద కొనసాగుతోంది.