ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 42 పాయింట్లు పెరిగి 17,754 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 123 పాయింట్లు ఎగిసి 60,348 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ 226 పాయింట్లు పెరిగి 41,577 వద్ద స్థిరపడింది. ఇండస్‌ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, బజాజ్ ఆటో, ఎల్‌టీ షేర్లు లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో, టెక్ మహీంద్రా, ఇన్ఫీ, అపోలో హాస్పిటల్స్ షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 13 పైసలు బలహీనపడి 82.05 వద్ద స్థిరపడింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.720 తగ్గి రూ.55,630 గా ఉంది. కిలో వెండి రూ.1450 తగ్గి రూ.65,550 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.1010 తగ్గి రూ.24,570 వద్ద ఉంది. బిట్‌కాయిన్ (Bitcoin) 1.54 శాతం తగ్గి రూ.18.03 లక్షల వద్ద కొనసాగుతోంది.