ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 42 పాయింట్లు పెరిగి 17,599 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 143 పాయింట్లు పెరిగి 59,832 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంక్ 41 పాయింట్లు పెరిగి 41,041 వద్ద స్థిరపడింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా మోటార్స్ షేర్లు లాభపడ్డాయి. హెచ్‌సీఎల్ టెక్, ఓఎన్‌జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టైటాన్ షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 11 పైసలు బలపడి 81.99 వద్ద స్థిరపడింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.380 తగ్గి రూ.60,980 గా ఉంది. కిలో వెండి రూ.600 తగ్గి రూ.76,490 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.640 తగ్గి రూ.26,330 వద్ద ఉంది. బిట్ కాయిన్ 2.43 శాతం తగ్గి రూ.22.83 లక్షల వద్ద ఉంది.