ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 38 పాయింట్లు పెరిగి 17,398 వద్ద క్లోజైంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 114 పాయింట్లు పెరిగి 59,106 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ 204 పాయింట్లు పెరిగి 40,813 వద్ద స్థిరపడింది. హీరోమోటో కార్ప్, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, మారుతీ, దివిస్ ల్యాబ్ షేర్లు లాభపడ్డాయి. బీపీసీఎల్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అపోలో హాస్పిటల్స్, ఇన్ఫీ, ఐటీసీ షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 16 పైసలు బలహీనపడి 82.33 వద్ద స్థిరపడింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 తగ్గి రూ.59,670 గా ఉంది. కిలో వెండి రూ.500 తగ్గి రూ.74,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.140 తగ్గి రూ.26,010 వద్ద ఉంది. బిట్ కాయిన్ 0.16 శాతం పెరిగి రూ.23.39 లక్షల వద్ద ఉంది.