ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 129 పాయింట్లు తగ్గి 17,321 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 501 పాయింట్లు తగ్గి 58,909 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంక్ 308 పాయింట్లు తగ్గి 40,389 వద్ద ముగిసింది. అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, బీపీసీఎల్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, హీరోమోటో షేర్లు లాభపడ్డాయి. మారుతీ, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫీ షేర్లు నష్టపోయాయి. రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు ఎగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 9 పైసలు బలపడి 82.59 వద్ద స్థిరపడింది. 4 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.170 పెరిగి రూ.56,290 గా ఉంది. కిలో వెండి రూ.66,800 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.400 పెరిగి రూ.25,410 వద్ద ఉంది. బిట్‌కాయిన్ (Bitcoin) 0.36 శాతం పెరిగి రూ.19.40 లక్షల వద్ద కొనసాగుతోంది.