నవంబర్‌ నెల బ్యాంకు సెలవుల జాబితా వచ్చేసింది.

ఈ సారి బ్యాంకులకు 11 రోజులే సెలవులు వచ్చాయి.

పండుగలు, పర్వదినాలు ముగియడమే ఇందుకు కారణం.

నవంబర్‌ 6, 13, 20, 27 ఆదివారాలు వచ్చాయి.

12, 26 రెండు, నాలుగో శనివారాలు. అంటే వీకెండ్‌ సెలవులు.

కన్నడ రాజ్యోత్సవం, గురునానక్‌ జయంతి,కార్తీక పౌర్ణమి, కనకదాస జయంతి ఇంకా...

సెంగ్‌ కుట్సెనెమ్‌ సందర్భంగా నవంబర్‌ 1, 8, 11, 23న సెలవులు.

ఆర్‌బీఐ ప్రకారం రాష్ట్రాలను బట్టి సెలవులు ఉంటాయి.

నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ యాక్ట్‌, ఆర్టీజీఎస్‌, బ్యాంక్స్‌ క్లోజింగ్‌ అకౌంట్స్‌ చట్టాల ప్రకారం సెలవులు ఇస్తారు.

బ్యాంకు సెలవులు రాష్ట్రాలు, ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. కొన్ని సెలవులు మాత్రం దేశ వ్యాప్తంగా ఒకేలా ఉంటాయి.