ఈ నెల ఆరంభం కుంభ రాశివారికి సవాలే! కుంభ రాశి వారికి ఫిబ్రవరి నెల ప్రారంభంలో ఇంటా బయటా అన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటారు. ఆరోగ్యం కూడా అంతబాగోదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు. ఉద్యోగులకు ఈ నెలలో వారి లక్ష్యాలను సాధించడానికి అదనపు శ్రమ , కృషి అవసరం. వ్యాపారులు మార్కెట్‌లో మాంద్యాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. భాగస్వామ్యంతో ఏదైనా వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నట్లయితే దానికి సంబంధించిన ఏదైనా నిర్ణయం జాగ్రత్తగా తీసుకోండి. నెలలో రెండవ వారంలో కొన్ని పెద్ద ఖర్చులు అకస్మాత్తుగా తలెత్తవచ్చు. విద్యార్ధులకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. సీజనల్ వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. చేపట్టిన పనులు పూర్తికావాలంటే అందరితో కలసికట్టుగా పనిచేయాలి..Image Credit: Pixabay