గూగుల్‌ ఆల్ఫాబెట్‌ క్వార్టర్లీ ఫలితాలు నిరాశా జనకంగా ఉన్నాయి.

సెప్టెంబర్ త్రైమాసికంలో మార్కెట్ అంచనాలు అందుకోలేదు.

మాంద్యం భయాలతో ఆన్లైన్ యాడ్స్ రెవెన్యూ తగ్గింది. ఆదాయా వృద్ధి రేటు పడిపోయింది.

గతేడాది యాడ్స్ వల్ల ఆల్ఫాబెట్ 53.13 బిలియన్‌ డాలర్లు ఆర్జించింది.

ఈ ఏడాది తక్కువ వృద్ధిరేటుతో 54.48 బిలియన్లు ఆర్జించింది.

కంపెనీ మొత్తం ఆదాయం 69.09 బిలియన్‌ డాలర్లు. గతేడాది Q3లో ఇది 65.12 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

యూట్యూబ్‌ ఆదాయం 7.42 బిలియన్‌ డాలర్లు వస్తుందని అంచనా వేస్తే..

కేవలం 7.07 బిలియన్‌ డాలర్లు మాత్రమే వచ్చాయని కంపెనీ తెలిపింది.

కంపెనీ ఫలితాలతో షేర్ల ధర భారీగా పతనమైంది. అనలిస్టులు రేటింగ్ తక్కువగా ఇస్తున్నారు.

ఆదాయం తగ్గడంతో ఖర్చులు తగ్గించుకొనే పనిలో గూగుల్ ఉంది. ఉద్యోగ నియామకాలను తగ్గిస్తోంది. రీస్ట్రక్చర్లో భాగంగా కొందరిని బయటకు పంపొచ్చు.