Zimbabwe vs India 5th T20 Match Highlights | ఐదో టీ20లోనూ భారత్ దే విక్టరీ..సిరీస్ 4-1 తేడాతో కైవసం

 టీమిండియా జింబాబ్వేతో జరిగిన ఐదో టీ20 మ్యాచ్ లోనూ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జింబాబ్వేను యంగ్ ఇండియా సమర్థంగానే ఎదుర్కొంది. జైశ్వాల్, అభిషేక్ శర్మ, కెప్టెన్ గిల్ దూకుడుగా ఆడే ప్రయత్నంలో ఔటై పోయినా...వికెట్ కీపర్ సంజూశాంసన్ ఈ మ్యాచ్ లోనూ రఫ్పాడించాడు. 45బాల్స్ లో 1 ఫోర్, 4 భారీ సిక్సర్లతో 58పరుగులు చేశాడు సంజూ. రియాన్ పరాగ్, శివమ్ దూబే నుంచి సంజూకు సహకారం అందటంతో భారత్ 6 వికెట్ల నష్టానికి 167పరుగులు చేయగలిగింది. 168పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన జింబాబ్వే ఏ దశలోనూ టార్గెట్ ఛేజ్ చేసే దిశగా సాగలేదు. 15పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన జింబాబ్వేను మరమణి, డియోన్ మైర్స్ కాసేపు ఆదుకునే ప్రయత్నం చేశారు. మైర్స్ 37పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా..చివర్లో ఫరాజ్ అక్రమ్ కాసేపు మెరుపులు మెరిపించాడు. భారత్ బౌలర్లలో ముకేశ్ కుమార్ 4వికెట్లతో అద్భుతంగా రాణించాడు. బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించిన శివమ్ దూబే బౌలింగ్ లోనూ రెండు వికెట్లు తీసుకున్నాడు. తుషార్ దేశ్ పాండే, వాష్టింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మకు తలో వికెట్ పడ్డాయి. ఫలితంగా జింబాబ్వే 18.3ఓవర్లలో 125పరుగులకు ఆలౌట్ అవటంతో భారత్ 42పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను 4-1 తేడాతో గెలుచుకుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola