YS Jagan Lotuspond Constructions Demolition | మాజీ సీఎం జగన్ లోటస్ పౌండ్ ముందు నిర్మాణాలు కూల్చివేత

Continues below advertisement

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసంలో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. హైదరాబాద్ లో జగన్ నివాసంలోని లోటస్ పాండ్ లో ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా లోటస్ పాండ్ ముందు ఫుట్ పాత్ లను ఆక్రమించి సెక్యూరిటీ పోస్ట్ ల నిర్మాణాలను చేపట్టారు.

గత ఐదేళ్లుగా జగన్ తాడేపల్లిలో ఉంటున్నారు.  లోటస్ పాండ్‌లో ఉండటం లేదు. అయినప్పటికీ ఏపీలో సీఎం .. తెలంగాణ ఇంటికి ఏపీ పోలీసులు భద్రత కల్పించారు. ఇంటి బయట సెక్యూరిటీ రూములు నిర్మింప చేసుకుని అక్కడే ఉన్నారు.  ఈ నిర్మాణాలపై స్థానికులు పదే పదే గ్రేటర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. పలుమార్లు లోటస్ పాండ్ వ్యక్తుల దృష్టికి తీసుకు వచ్చినా తొలగించలేదు. దీంతో శుక్రవారం సాయంత్రం.. తాము ఆ అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని నోటీసులు జారీ చేశారు.  శుక్రవారం ఉదయం.. ఆక్రమణల తొలగింపు బృందం వచ్చి పని పూర్తి చేసింది. 

 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram