Yellandu Ursu: మతాలకు అతీతంగా వేలాది మందిని ఏకం చేస్తున్న ఉర్సు పండుగ..!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇల్లందు సమీపంలోని సత్యనారాయణపురం గ్రామంలో జరిగే ఉర్సు ఉత్సవాలు తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద ఉర్సు ఉత్సవాలు. హజరత్ నాగుల్‌మీరా దర్గా మౌలాచాన్ వద్ద మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలకు తెలంగాణలోని వివిద ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. డిసెంబర్ 3 నుంచి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల కోసం దర్గా కమిటీ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.