Errabelli Dayakar Rao: బండి సంజయ్ దీక్షకు అర్థం లేదు.. మంత్రి ఎర్రబెల్లి
ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన దీక్షపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు చేయటం లేదంటూ కేంద్రమే చెబుతుంటే.... ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎందుకు ప్రశ్నిస్తున్నారంటూ ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ కి వీలైతే కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ధాన్యం కొనుగోళ్లు జరిగేలా చూడాలన్నారు.