Electrofishing: ప్రాణాలతో చెలగాటం.. కరెంట్‌తో చేపలకు గాలం..!
ఇటీవల భారీ వర్షాలకు చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. ప్రత్యేకించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ వర్షాల ప్రభావం కనిపిస్తోంది. వర్షాల కారణంగా కొట్టుకువస్తున్న చేపలను పట్టుకునేందుకు చెరువుల వద్ద వేటగాళ్లు పోటీపడుతున్నారు. ఇల్లెందుపాడు చెరువు వద్ద వేటగాళ్లు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొంతమంది యువకులు కరెంటు తీగలతో గాలాలు చేసి విద్యుత్ షాక్ ఇస్తూ చేపలను పడుతున్నారు. ప్రమాదకర స్థితిలో నీళ్లలో నిలబడి అక్కడే కరెంట్ ఇస్తూ చేపలు పట్టడం స్థానికులను విస్మయానికి గురి చేస్తోంది. ఎవరైనా అధికారులు పట్టించుకుని ఇలా ప్రాణాంతంకంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.