MRO Office: మహిళకు ఎమ్మార్వో ఆఫీసులో అవమానం.. ఉద్యోగి నిర్వాకం చూడండి
సర్టిఫికెట్ కోసం నెల రోజుల నుంచి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న మహిళకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అర్బన్ ఆఫీస్‌కు వచ్చిన ప్రతిసారీ మహిళ అని కూడా చూడకుండా వెంకటేశ్వర్లు అనే ఉద్యోగి నోటికి వచ్చినట్లు తిట్టడంతో సదరు మహిళ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే దురుసుగా సమాధానం ఇస్తున్నాడు. ఎవరు ఏం చేసుకుంటారో చేసుకోండి, వీడియో తీసినంత మాత్రం ఎవరికీ భయపడను అంటూ సమాధానం చెప్పాడు. ఏ అధికారికి కంప్లైంట్ చేస్తారో చేసుకోండంటూ దబాయించిన వెంకటేశ్వర్లు.. ఆ వీడియోతో పై అధికారులకు తన సమస్య విన్నవించుకుంది.