Palakurthi Politics: మండలాధ్యక్షుడి మార్పుతో పాలకుర్తి నియోజకవర్గంలో వేడెక్కిన రాజకీయాలు
పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ లో వర్గపోరు బయటపడుతోంది. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ అయిన ఝాన్సీ రెడ్డిపై పలువురు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే స్థానంలో ఆమె అత్త అయిన ఝాన్సీ పెత్తనం చేస్తున్నారని, ఆమెకు పౌరసత్వమే లేదని వారంతా హైదరాబాద్ లోని గాంధీ భవన్ ముందే ఆందోళనకు దిగారు.