Kakatiya Dynasty's Heir: వరంగల్ లో కాకతీయ వారసుడి సందడి ఎలా ఉందో చూడండి| ABP Desam
కాకతీయుల వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ కు ఘన స్వాగతం లభించింది. హనుమకొండ హరిత హోటల్ నుంచి బయలుదేరిన ఆయన.... తొలుత వరంగల్ లోని భద్రకాళి ఆర్చ్ కు చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు తెలంగాణ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్ తదితరులు వెళ్లారు. ఆ తర్వాత కమల్ చంద్ర భంజ్ దేవ్... ప్రత్యేక వాహనంపై భద్రకాళి దేవాలయానికి చేరుకున్నారు.