Villagers Crossing Flood Flow In Vechareni Siddipet District: సోషల్ మీడియాలో వైరల్

సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేచరేణి గ్రామవాసుల దుస్థితి ఇది. ఏడాదంతా ఎలాంటి ఇబ్బందులూ ఉండవు కానీ.... వానాకాలంలో వాగుకు వరద వస్తే మాత్రం ఇలా తీవ్ర ఇబ్బందులు పడాల్సిందే. ఇక్కడ ఓ వ్యక్తి అంత్యక్రియల కోసం ఇలా నడుములోతు వరద ప్రవాహంలోనే నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. నిన్న గ్రామంలో బాలయ్య అనే వ్యక్తి చనిపోయాడు. బంధువులు, కుటుంబసభ్యులు పాడె మోసుకుంటూ.... ఈ ప్రవాహంలోనే కష్టాలు పడుతూ ముందుకెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వేచరేణి వాగుపై లో లెవెల్ కాజ్ వే నిర్మాణానికి జనవరిలో కోటీ 96 లక్షలు మంజూరై.... టెండర్లు పూర్తైనప్పటికీ.... కాంట్రాక్టు దక్కించుకున్న సదరు కాంట్రాక్టర్.... పనులు మొదలుపెట్టలేదని గ్రామస్థులు చెబుతున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola