Vikarabad Railway Station Accident: కదులుతున్న రైలు ఎక్కుతుండగా ప్రమాదం, 2 గంటల పాటు నరకం
వికారాబాద్ రైల్వేస్టేషన్ లో నిన్న రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దీనివల్ల ఓ వ్యక్తి సుమారు రెండుగంటల పాటు నరకయాతన అనుభవించాడు. కదులుతున్న యశ్వంత్ పూర్ రైల్లో ఎక్కే ప్రయత్నం చేస్తుండగా, అదుపుతప్పి ట్రైన్ మరియు ప్లాట్ ఫాం మధ్యలో ఇరుక్కుపోయాడు. వెంటనే రైలు నిలిపివేసి ప్లాట్ ఫాం పగులగొట్టి రైల్వే పోలీసులు అతణ్ని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అతనికి తీవ్రగాయాలు అయ్యాయి. ముందు వికారాబాద్ ఆసుపత్రికి ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వ్యక్తి రాయచూర్ కు చెందిన సతీష్ గా గుర్తించారు.