Vikarabad Collector Prateek Jain Attacked | కలెక్టర్‌పై గ్రామస్థుల మూకుమ్మడి దాడి | ABP Desam

Continues below advertisement

రేవంత్ రెడ్డి ఇలాకాలో కలెక్టర్ మీద ప్రజలు దాడి చేసి తరిమికొట్టారు. వారు ఏకంగా రాళ్ళు, కర్రలతో దాడి చేశారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఫార్మా కంపెనీ ఏర్పాటుపై గ్రామస్థుల అభిప్రాయ సేకరణకు వచ్చిన జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్, ఇతర అధికారుల వాహనాలపై గ్రామస్థులు, రైతులు రాళ్ళతో దాడి చేశారు. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ పై ఓ మహిళ చేయి కూడా చేసుకుంది. కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డిపై కూడా గ్రామస్థులు విపరీతంగా దాడి చేశారు. దీంతో ఆ గ్రామంలో తీవ్రమైన ఉద్రిక్తత నెలకొంది. కలెక్టర్ సహా అధికారులంతా వెనక్కి వెళ్లే వరకూ గ్రామస్థులు వెంబడించి మరీ దాడి చేశారు. ఈ సమయంలో గ్రామస్థులు మూడు వాహనాలు ధ్వంసం చేశారు. ఆ వెంటనే ఊరిలో భారీగా పోలీసులను మోహరించారు. దుద్యాల, లగచర్ల పోలేపల్లి, లగచర్ల తాండలో ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు అక్కడికి వెళ్లిన సందర్భంగా ఈ ఘటన జరిగింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram