సీఎం రేవంత్ ఇలాకాలో ఇంటర్నెట్ బంద్, ఆ ఊర్లో ఉద్రిక్తతలు

Continues below advertisement

Attack on Vikarabad Collector: తెలంగాణలో ముఖ్యమంత్రి సొంత జిల్లా వికారాబాద్ లో కలెక్టర్ ప్రతీక్ జైన్ పై (Vikarabad Collector Latest News) ప్రజలు దాడికి యత్నించడంతో పాటు.. కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అధికారిని పరిగెత్తించి మరి కొట్టిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ దాడికి ఎవరు రైతులను ముందుండి నడిపించారనే దానిపై విచారణ చేసి అర్ధరాత్రి వరకు 50 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు. వారిని పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. రైతుల అరెస్ట్ నేపథ్యంలో కొడంగల్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. ముందస్తుగా ఇంటర్నెట్ కూడా నిలిపివేశారు. దాడి జరిగిన లగచర్ల గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఫార్మా కోసం భూములు వద్దన్నందుకే ప్రభుత్వం తమపై కక్ష్య కట్టిందని గ్రామస్థులు వాపోతున్నారు. ఈ ఘటనపై కలెక్టర్ సోమవారం మాట్లాడుతూ.. తనపై ఎవరూ దాడి చేయలేదని, దాడి అనే పదం వాడొద్దని కోరారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram