Vanjeevi Ramaiah Road Accident: రోడ్డు దాటుతుండగా వచ్చి ఢీకొన్నారు | ABP Desam
పద్మశ్రీ వనజీవి రామయ్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఖమ్మం రూరల్ మండలం రెడ్డిగూడెంలో మొక్కలకు నీళ్లు పోసేందుకు బైక్ మీద వెళ్తుండగా... ఎదురుగా మరో బైక్ రావడంతో అదుపుతప్పి కిందపడిపోయారు. స్థానికులు రామయ్యను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. కాలుకు, తలకు గాయాలయ్యాయని, రామయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.