TRS Leaders at Jagtial : కేసీఆర్ సభ కోసం జగిత్యాలలో భారీ ఏర్పాట్లు | DNN | ABP Desam
ఈనెల 7న జగిత్యాల లో భారీ సభ ఏర్పాటుకు టీఆర్ఎస్ సర్వం సిద్ధం చేస్తోంది. సీఎం కేసీఆర్ నిర్వహించే సభ ద్వారా నూతన కలెక్టరేట్, మెడికల్ కాలేజీ, పార్టీ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. సభ ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి హరీశ్ రావుతో కలిసి ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. ఉద్యమాల తెలంగాణను బెదిరింపులతో భయపెట్టలేరని సభా పరిశీలన సందర్భంగా మంత్రి హరీష్ రావు అన్నారు.