Mallanna Sagar: అధికారుల నిర్లక్ష్యం.. ఇల్లు కూల్చివేతలో విషాదం.. మల్లన్న సాగర్ నిర్వాసిత గ్రామవాసి మృతి..

మల్లన్న సాగర్ నిర్వాసిత గ్రామం నాగర్‌కర్నూలు జిల్లా ఎర్రవల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ వ్యక్తి మృతి చెందాడు. అర్థరాత్రి ఇళ్లు కూల్చివేత చేపట్టిన అధికారులను గ్రామస్థులు నిలదీశారు. ఒకట్రెండు రోజులు టైం కావాలని అడిగినా పట్టించుకోలేదు. దీంతో ఇంట్లో సామానులు తెచ్చుకునేందుకు వెళ్లిన కనయ్య శిథిలాల్లో చిక్కుకొని గాయాలపలయ్యాడు. ఆయన్ని హైదారాబాద్‌ యశోద ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూనే ప్రాణం వదిలేశాడాయన. దీనిపై ఎర్రవల్లి గ్రామస్తులు మండిపడుతున్నారు. అధికారుల దుశ్చర్య కారణంగా ఓ నిండు ప్రాణం పోయిందని దుమ్మెత్తి పోస్తున్నారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola