Traffic CI Lakshmi Madhavi Drunk and Drive | కన్నప్రేమతో కనువిప్పు కలిగించిన పోలీస్ | ABP Desam
ఈ వీడియోలో కనిపిస్తున్న ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ పేరు లక్ష్మీ మాధవి. ఓ చిన్నారితో ఓ వ్యక్తికి కనువిప్పు కనిగేలా చేస్తున్న ఈమె ఉప్పల్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. డ్రంక్ అండ్ టెస్టుల్లో భాగంగా మద్యం సేవించి తన కుమారుడు, భార్యతో కలిసి టూవీలర్ పై వెళ్తున్న ఓ వ్యక్తిని గుర్తించారు మాధవి. డ్రంక్ డ్రైవ్ టెస్ట్ చేస్తే అతను తాగినట్లు తేలింది. ఫైన్ వేయటం...బండి లాక్కోవటం లాంటివి చేయకుండా...ఆయన చేతుల్లో ఉన్న బిడ్డతోనే ఇంకెప్పుడూ తాగొద్దు నాన్నా నాకు నువ్వు కావాలి అని చెప్పించారు. ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ ఇప్పించిన ఆ కౌన్సిలింగ్ తో ఆ తండ్రి కరిగిపోయాడు. తన కుమారుడిని హత్తుకుని ఇంకెప్పుడూ తాగనని ప్రమాణం చేశారు. ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ లక్ష్మీ మాధవి తీసుకున్న నిర్ణయం..మార్పు తెచ్చిన విధానంపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఉన్నత అధికారులు లక్ష్మీమాధవి చర్యలను ప్రశంసిస్తున్నారు.