ఎద్దుపై పులి దాడి, రెండ్రోజులు అదే ఫుడ్.. వణికిపోతున్న ప్రజలు
చూశారా.. పెద్దపులి గురించి ఊర్లలో ఎలా దండోరా వేయిస్తున్నారో. నిర్మల్ జిల్లాలో గత కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి. ఆ పులి ఎక్కడ తమపై దాడి చేస్తుందో అని అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. గత మూడు రోజుల క్రితం ఓ ఎద్దును హతమార్చి రెండు రోజులపాటు అక్కడే స్థిర మాసం ఏర్పరచుకుంది. రెండు రోజులపాటు హతమార్చిన ఎద్దు మాంసాన్ని తింటూ కనిపించకుండా పోయిన పెద్దపులి మూడో రోజు హఠాత్తుగా.. మామల రేంజ్ పరిధిలోని బుర్కరేగిడి పరిసర ప్రాంతం నుండి పెంబి రేంజ్ మీదుగా తాండ్ర రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. అటవీ అధికారి రమేష్ రావ్ మాట్లాడుతూ.. పులి పెంబి తాండ్ర అరేంజ్ పరిధిలో సంచరిస్తున్నందున సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉదయం 10 నుండి నాలుగు గంటల లోపు తమ వ్యవసాయ పనులు చేసుకోవాలని.. అంతా గుంపులుగా కలిసి తిరగాలని అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో డప్పుతో దండోరా వేయిస్తున్నారు. పులి ఎవరికి హాని తలపెట్టదని అది అడవిలో తిరుగుతూ వెళ్ళిపోతుందని, ఎవరైనా పులి కనిపిస్తే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలన్నారు.