Telangana Elections ABP C Voter Opinion Poll: తెలంగాణలో హంగ్ తప్పదు! కానీ లీడింగ్ ఎవరికి వస్తుంది..?
ఎన్నికల ఫలితాలను వాస్తవానికి చాలా దగ్గరగా అంచనాలు వేస్తుంది అని పేరు ఉన్న ఏబీపీ సీఓటర్ ఓపినియన్ పోల్స్ విడుదలయ్యాయి. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఏబీపీ సీ ఓటర్ తన ఓపినియన్ పోల్ ఫలితాలను వెల్లడించింది. మొత్తం 119 స్థానాలకు గానూ కాంగ్రెస్ 48 నుంచి 60 స్థానాలు, బీజేపీ 5 నుంచి 11, బీఆర్ఎస్ 43 నుంచి 55 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లు ఏబీపీ సీ ఓటర్ ఓపినియన్ పోల్ లో తేలింది. అలాగే ఇతరులు 5 నుంచి 11 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లు ఏబీపీ సీ ఓటర్ అంచనా వేసింది. .