CM Revanth Reddy About Farm Loan Waiver: రైతు రుణమాఫీ గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డి

Continues below advertisement

  CM Revanth Reddy About Farm Loan Waiver: హైదరాబాద్: మే 6, 2022న వరంగల్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ లో భాగంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీని అమలు చేయడానికి విధాన పరమైన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఒకే దఫాలో రైతులకు రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.  తెలంగాణ కేబినెట్ భేటీ అనంతరం శుక్రవారం రాత్రి 7 గంటలకు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని ఇస్తామని హామీ ఇచ్చిన సోనియా గాంధీ, రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నారని చెప్పారు. సోనియా గాంధీ మాట చెప్పారంటే అది శిలా శాసనం అన్నారు. 

‘వరంగల్ డిక్లరేషన్ లో రూ.2 లక్షల రైతు రుణ మాఫీ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చారని కొందరు కామెంట్లు చేశారు. కానీ తమ ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని భావించింది. ఈ మేరకు తెలంగాణ కేబినెట్ లో చర్చించి రైతు రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram