బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థత

Continues below advertisement

చింతల్‌లోని శ్రీచైతన్య పాఠశాలలో కలకలం రేగింది. మూడో అంతస్తులోని బాత్‌రూమ్‌లో యాసిడ్ బాటిల్ కింద పడిపోయింది. ఒక్కసారిగా రూమ్‌లోను ఘాటు వాసన వచ్చింది. ఈ వాసనను తట్టుకోలేక విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొంత మంది రక్తపు వాంతులు చేసుకున్నారు. ఆందోళన చెందిన పాఠశాల యాజమాన్యం వెంటనే ఆ విద్యార్థులను హాస్పిటల్‌కి తరలించింది. తల్లిదండ్రులకు సమాచారం లేకుండా ఈ పని చేసిందని ఆరోపణలు వచ్చాయి. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున వచ్చి పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనలో 40-50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటన జరిగిన తరవాత స్కూల్ యాజమాన్యం విద్యార్థులను ఇళ్లకు పంపింది. చింతల్‌లోని హాస్పిటల్‌లో బాధితులకు చికిత్స కొనసాగుతోంది. అయితే...ఎవరికీ ఎలాంటి అపాయం లేదని..అనుకోకుండా ఇలా జరిగిందని స్కూల్ ప్రిన్సిపల్ వెల్లడించారు. తల్లిదండ్రులు మాత్రం తమకు తెలియకుండానే హాస్పిటల్‌కి తీసుకొచ్చారని మండి పడ్డారు. ఫలితంగా కాసేపు స్కూల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram