SP Balasubrahmanyam Statue Controversy | బాలు విగ్రహం చుట్టూ పెద్ద వివాదం | ABP Desam
60వేల పాటలు పాడిన మహాగాయకుడు...16 భాషల్లో తన స్వర మాధుర్యం వినిపించిన గాన గంధర్వుడు ఆయన...తమిళ వాళ్లు..తెలుగు వాళ్లు..కన్నడ వాళ్లే కాదు యావత్ భారతం అంతా మా బాలు అని పిలుచుకునే ఆధునిక యుగ వాగ్గేయకారుడు. తన అభిమానులని విడిచి 5ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ బాలు బతికే ఉన్నాడని భావించే ఆయన అభిమానులకు ఇప్పుడు ఓ వివాదం దిగులు కలిగిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో పెట్టతలిచిన బాలు విగ్రహం చుట్టూ ఇప్పుడు ఓ పెద్ద సమస్య వచ్చి పడింది. ఇది కొంత మంది కావాలనే చేస్తున్నారా...లేదా నిజంగానే యావత్ తెలంగాణ ఇష్యూనా జనరలైజ్ చెప్పట్లేదు కానీ...బాలు విగ్రహం రవీంద్ర భారతిలో పెట్టడానికి ససేమిరా అంటున్నారు కొంతమంది. పృథ్వీరాజ్ అనే తెలంగాణ ఉద్యమ కారుడు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పని చెబుతున్నారు. నేరుగా ఆయన ఎస్పీ బాలు బావగారు, సినీనటుడు అయిన శుభలేఖ సుధాకర్ తో గొడవ పడుతున్న వీడియో వైరల్ గా మారింది. బాలు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావించింది సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ సాంస్కృతిక తరపున ఓ కమిటిని వేసి దాంట్లో శుభలేఖ సుధాకర్ ని భాగస్వామ్యం చేసింది మంత్రి జూపల్లి కృష్ణారావు.
అసలు వివాదం ఏంటంటే ఎస్పీ బాలు తెలంగాణ వాడా..ఆయన తెలంగాణకు ఏమన్నా చేశాడా...తెలంగాణ వాళ్ల విగ్రహాలు సాంస్కృతిక భవనంలో పెట్టండి పీవీ నరసింహారావు ఉన్నారు..చిత్ర పరిశ్రమలో దేశవ్యాప్తంగా తెలంగాణకు పేరు తీసుకువచ్చిన పైడి జైరాజ్ ఉన్నారు అలాంటి తెలంగాణ వ్యక్తుల, మహనీయుల విగ్రహాలు కాదని తెలంగాణకు సంబంధం లేని ఓ వ్యక్తి విగ్రహాన్ని రవీంద్ర భారతిలో పెట్టడం ఏంటీ పృథ్వీరాజ్ చేస్తున్న ఆర్గ్యుమెంట్. దానికి ఆయన ఉద్యమాన్ని కలిపి మాట్లాడుతున్నారు. ఇది ఆయన వ్యక్తిగతమా లేదా తెలంగాణ లో మేజర్ ప్రజల అభిప్రాయం ఇదేనా విషయం చుట్టూ ఇప్పుడు వివాదం నడుస్తోంది. నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగి...తమిళనాట చదువుకుని...చెన్నైలో సినిమా అవకాశాలు సంపాదించి ఆ భాష ఈ భాష అని లేకుండా 16 భాషల్లో పాటలు పాడి గాన గంధర్వుడిగా పేరు గాంచిన ఎస్పీ బాలును ఓ ప్రాంతానికి అందునా ఆంధ్రా వాడిగా పరిమితం చేయటం సబబా అని బాలు అభిమానులు అడుగుతున్న ప్రశ్న. తెలంగాణ రాష్ట్రగీతంగా ఉన్న జయ జయహే తెలంగాణను పాడాలంటే బాలు తను పాడనని చెప్పారని మరో వివాదాన్ని లేవెనెత్తుతున్నారు. మరి జయ జయహే తెలంగాణను రాష్ట్ర గీతంగా మార్చి అందెశ్రీనికి గౌరవం అందించిన రేవంత్ రెడ్డి ఈ విషయం తెలియకనే బాలు విగ్రహం రవీంద్ర భారతిలో పెట్టాలని నిర్ణయించుకున్నారా... సో ప్రభుత్వమే ఈ పని చేస్తున్నప్పుడు శుభలేఖ సుధాకర్ నో, మరొకరినో కార్నర్ చేయటం ఏంటి నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని తెలంగాణలోనే మరికొందరు చెబుతున్న అభిప్రాయం. మొత్తంగా ఈనెల 14న బాలు విగ్రహావిష్కరణకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది కాబట్టి ఈ వివాదం ఎంత వరకూ వెళ్తుందో చూడాలి.