
SLBC Tunnel Incident vs Uttarakhand Tunnel | ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ సక్సెస్..SLBC లో దేనికి ఆటంకం.? | ABP Desam
ఉత్తరాకాశీ టన్నెల్, SLBC టన్నెల్...ఈ రెండింటి కథ ఒకటే..దురదృష్టం మనుషుల ప్రాణాలతో చెలగాటమాడింది. అయితే మానవ ప్రయత్నం ఉత్తరకాశీ ప్రమాదం నుంచి బాధితులను సురక్షితం తీసుకువస్తే...అదే మానవ ప్రయత్నం ఎంత చేస్తున్నా SLBC టన్నెల్ లో మాత్రం ఆ కృషి సరిపోవటం లేదు. ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అవటానికి SLBC టన్నెల్ లో ఇబ్బందులు ఎదురవ్వటానికి ఈ రెండు ఆపరేషన్స్ లో ప్రధాన తేడాలేంటీ అనేది ఇప్పుడు అసలు చర్చ.2023 నవంబర్ 12..ఉత్తరాఖండ్ లో ఉత్తర కాశీ జిల్లా శిఖ్యారా దగ్గర నేషనల్ హైవే పై ఉన్న టన్నెల్ లో ప్రమాదం జరిగింది. యుమనోత్రి నేషనల్ హైవే టన్నెల్ లో ప్రమాదం జరిగి 41మంది టన్నెల్ లో చిక్కుకుపోయారనేది వార్త. రెస్క్యూ ఆపరేషన్స్ మొదలయ్యాయి. కొన్ని గంటల పాటు తీవ్రంగా కృషి చేసిన తర్వాత కూలీలు చిక్కుకుపోయిన చిన్న పైప్ ను పంపించగలిగారు ఫలితంగా థర్మల్ కెమెరాస్ వాడి అటు వైపు చిక్కుకుపోయిన ఆ కూలీల పరిస్థితిని తెలుసుకోగలిగారు. అదృష్టం ఏంటంటే 41మంది కూలీలు సేఫ్ గా ఉన్నారు. ఇప్పుడు వాళ్లను బయటకు తీసుకురావటం అనేదే పెద్ద టాస్క్. ఈలోగా కూలీలకు అదే పైపుల ద్వారా ఆహారాన్ని, నీటిని సరఫరా చేశారు. వాకీటాకీల సాయంతో 41మంది కూలీలకు ధైర్యం చెప్పి ఆర్నాల్డ్ డిక్స్ లాంటి ఇంటర్నేషనల్ టన్నింగ్ నిపుణుల సాయంతో 400 గంటల పాటు నిర్విరామ కృషి చేసి 41మంది ప్రాణాలతో సేఫ్ గా బయటకు తీసుకురాగలిగారు. దేశ చరిత్రలోనే అతిగొప్ప రెస్య్కూ ఆపరేషన్స్ లో ఒకటిగా ఉత్తరాఖండ్ టన్నెల్ ప్రమాదం నిలిచిపోయింది. అచ్చం అలాంటి ప్రమాదమే ఏడాది తర్వాత ఈనెల 22న తెలంగాణలోని నాగర్ కర్నూలు దగ్గర ఉన్న శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ బ్రాంచ్ టన్నెల్ దగ్గర జరిగింది. ఇక్కడ శిథిలాల్లో 8మంది చిక్కుకుపోయారు. ఇప్పటికి 6రోజులైనా కూలీలతో కనీసం కమ్యూనికేషన్ కూడా పాజిబుల్ కాలేదు. ఎందుకంటే ఉత్తరాఖండ్ టన్నెల్ ప్రమాదం వేరు...ఎస్ఎల్ బీసీ ప్రమాదం వేరు.